మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వచ్చే అకడమిక్ ఇయర్ లో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్లాస్ రూములో 30మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉంటే.. రెండు విడతలుగా విభజించి విద్యాబోధన చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు సరకులను పంపిణీ చేయాలని చెప్పింది.
స్కూల్ తెరిచే సమయంలో..
పాఠశాల ఆవరణను పూర్తిగా శానిటైజ్ చెయ్యాలి..క్రిమిసంహారాలతో కరోనా వైరస్ రహితంగా శుద్ధి చేయాలి.