బెంగాల్ రాష్ట్రంలో మార్పు అనివార్యమని. అక్కడి అవినీతితో ప్రజలు విసుగెత్తిపోయారని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ముఖ్యమంత్రి మేనల్లుడు, సోదరుల అవినీతిని వారు ఏవగించుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, సోదరుల గురించి ఆయన నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంగా తనకు అందిన ఫీడ్ బ్యాక్ ను బట్టి బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమైందని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ లో బీజేపీ చేపట్టిన రథయాత్ర..మార్పును మరింత బలోపేతం చేస్తుందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు.పలు కుంభకోణాల్లో మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపిస్తున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బెంగాల్ లోని మాల్దా లో రోడ్ షో ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ని ప్రజలు తిరస్కరిస్తారని ఆయన చెప్పారు. ఈ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారు. కాగా-వచ్ఛే ఏప్రిల్-మే నెలల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Read More:
‘మేడిన్ ఇండియా వ్యాక్సిన్ కోసం క్యూలో 25 దేశాలు’ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడి.