చంద్రునిపై చెక్కుచెదరని ‘చంద్రయాన్-2’ప్రగ్యాన్ రోవర్

చంద్రుని ఉపరితలంపై 'చంద్రయాన్-2' ప్రగ్యాన్ రోవర్ చెక్కు చెదరకుండా ఉందని, శిథిలమైన విక్రమ్ లాండర్ నుంచి కొన్ని మీటర్ల దూరం ముందుకు వెళ్లిందని చెన్నైకి చెందిన టెకీ షణ్ముగ సుబ్రమణ్యన్ తెలిపారు..

చంద్రునిపై చెక్కుచెదరని చంద్రయాన్-2ప్రగ్యాన్ రోవర్

Edited By:

Updated on: Aug 02, 2020 | 3:25 PM

చంద్రుని ఉపరితలంపై ‘చంద్రయాన్-2’ ప్రగ్యాన్ రోవర్ చెక్కు చెదరకుండా ఉందని, శిథిలమైన విక్రమ్ లాండర్ నుంచి కొన్ని మీటర్ల దూరం ముందుకు వెళ్లిందని చెన్నైకి చెందిన టెకీ షణ్ముగ సుబ్రమణ్యన్ తెలిపారు. విక్రమ్ లాండర్ క్రాష్ అయిన విషయాన్ని ఈయన గత ఏడాది డిసెంబరులోనే తెలియజేశాడు. ఇస్రో కూడా ఈయన అభిప్రాయాలతో ఏకీభవించింది. లాండర్ భాగాల స్థలం నుంచి రోవర్ ముందుకు కదిలిందని, చంద్రుని ఉపరితలం మీద కొంత దూరం ప్రయాణించిందని ఆయన ట్వీట్ చేశాడు. ప్రగ్యాన్ రోవర్ కదలికలను ట్రాక్ చేసేందుకు షణ్ముగ సుబ్రమణ్యన్ నాసా వారి అత్యాధునిక సాఫ్ట్ వేర్ ని ఉపయోగించాడు.

ఇస్రో చీఫ్ శివన్..ఇతని తాజా ‘పరిశోధనలపై’ స్పందించాల్సి ఉంది.  విక్రమ్ లాండర్ క్రాష్ అయిన అంశంపై ..తాము గతంలోనే ఈ విషయాన్ని తెలియజేశామని, అయితే ఈ యువ టెకీ చేసిన ప్రకటనకు వచ్చినంత ప్రాధాన్యత ఇస్రోకు లభించలేదని ఆయన గతంలో  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అవసరమైతే లాండర్ క్రాష్ గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.