
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ సవాళ్లు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈసారి ఎపిసోడ్ వెస్ట్ గోదావరిలో కంటిన్యూ అవుతోంది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో నిన్న జరిగిన ఘర్షణలో 10 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత వీరాంజనేయులు బాపిరాజుగూడెం చేరుకున్నారు. అధికార పార్టీ ప్రోద్బలంతో అక్రమంగా కేసులు బనాయించారని చింతమనేని అంటున్నారు. ఇదే అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది.