పోలవరానికి నిధులిస్తాం.. బట్ కండీషన్స్ అప్లై

|

Dec 09, 2019 | 3:05 PM

ఏపీ రాష్ట్రానికి జీవనాధార ప్రాజెక్టు అయిన పోలవరంపై కేంద్రం దోబూచులాడుతున్న సంగతి మరోసారి తేటతెల్లమైంది. ప్రాజెక్టుకు నిధులిస్తాం కానీ కండీషన్స్ అప్లై అంటోంది మోదీ ప్రభుత్వం. తాజాగా ఇదే వైఖరిని పార్లమెంటు వేదికగా సెలవిచ్చారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో వున్న నిధులను వెంటనే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు […]

పోలవరానికి నిధులిస్తాం.. బట్ కండీషన్స్ అప్లై
Follow us on

ఏపీ రాష్ట్రానికి జీవనాధార ప్రాజెక్టు అయిన పోలవరంపై కేంద్రం దోబూచులాడుతున్న సంగతి మరోసారి తేటతెల్లమైంది. ప్రాజెక్టుకు నిధులిస్తాం కానీ కండీషన్స్ అప్లై అంటోంది మోదీ ప్రభుత్వం. తాజాగా ఇదే వైఖరిని పార్లమెంటు వేదికగా సెలవిచ్చారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్.

పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో వున్న నిధులను వెంటనే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న 3 వేల 223 కోట్ల రూపాయలను విడుదల చేయవలసిందిగా అభ్యర్థిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చేసిన విజ్ఞప్తితోపాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో విజయసాయి రెడ్డి.. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి ప్రశ్నపై స్పందించిన మంత్రి తన జవాబులో పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడానికి ముందు చేసిన 5 వేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్‌ జరుపుతోంది. ఇప్పటి వరకు 3 వేల కోట్ల మేరకు ఆడిట్‌ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

అయితే, జాతీయ ప్రాజెక్టు అనగానే ఎలాంటి ఆడిట్ లేకుండా నిధుల విడుదల వుండదని క్లారిటీ ఇచ్చిన గజేంద్ర షెకావత్.. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని, కాకపోతే ఆడిటింగ్ సహా ఫార్మాలిటీస్ పూర్తి అయితేనే నిధుల విడుదల వుంటుందని తేల్చి చెప్పారు షెకావత్.