India vs Australia: ” మీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది”.. భారత జట్టుపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రశంసలు

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా పంబ రేపింది. సీనియర్ల ఒకరి వెంట ఒకరు గాయాలతో మ్యాచ్‌లకు దూరమైన కొత్త కుర్రాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్ విభాగాల్లో అధ్బుతంగా రాణించి..

India vs Australia:  మీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది.. భారత జట్టుపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రశంసలు

Updated on: Jan 19, 2021 | 1:58 PM

India vs Australia: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా పంబ రేపింది. సీనియర్ల ఒకరి వెంట ఒకరు గాయాలతో మ్యాచ్‌లకు దూరమైన కొత్త కుర్రాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫిల్డింగ్ విభాగాల్లో అధ్బుతంగా రాణించి.. ఆసిస్ ఆటగాళ్లను మూడు చెరువుల నీళ్లు తాగించారు.   ఆఖరి టెస్టులో ఆసీస్​పై మూడు వికెట్ల తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది భారత్​. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించారు భారత కుర్రాళ్లు. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఇండియా కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు, మాజీ ఆటగాళ్లు సెలబ్రిటీలు వేసిన ట్వీట్లు మీ కోసం.