నంద్యాల ఎంపీ, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నంద్యాల, కర్నూలులో ఉన్న ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని సమాచారం ఉండడంతో.. సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీ వైపు మొగ్గుచూపారు. చివరకు జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఆయన నంద్యాల నుంచి పోటీకి దిగారు.