లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు.. కొత్తపేట మార్కెట్ కమిటీకి నోటీసులు..

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 10:25 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో ఆరోగ్య నియమావళి పాటించనందుకు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కు, కమిటీ

లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు.. కొత్తపేట మార్కెట్ కమిటీకి నోటీసులు..
Follow us on

Lockdown: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో ఆరోగ్య నియమావళి పాటించనందుకు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కు, కమిటీ సభ్యులకు, సెక్రెటరీ, ఉన్నతాధికారులకు చైతన్య పురి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ లో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ పాటించని 44 మంది వ్యాపారస్తులపై చైతన్య పురి పోలీసులు కేసులు నమోదు చేశారు.

రైతులకు సరైన అవగాహన మరియు వ్యాపారస్తులు ( ట్రేడర్స్ ) కనీస ఆరోగ్య నియమాలను పాటించకుండా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న 44 మంది ట్రేడర్స్ పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. కోహెడ మార్కెట్ బంద్ అవడంతో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఒక్కసారిగా జనసంద్రంగా, రద్దీగా మారింది. రైతులు, వ్యాపారస్తులు, అధికారులు, సిబ్బంది, మార్కెట్ కు వచ్చే ప్రతిఒక్కరు విధిగా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని చైతన్య పురి ఇన్సిపెక్టర్ జానకి రెడ్డి విజ్ఞప్తి చేశారు.