క్యాపిటల్ వార్: కొనసాగుతున్న రైతుల మహా ధర్నా!

| Edited By:

Dec 27, 2019 | 12:36 AM

రాజధాని రైతుల పోరాటం కొనసాగుతోంది.  రైతుల రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్ళూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. తాము శిబిరాల్లోంచి కదిలేది లేదంటూ రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమయం ముగిసింది శిబిరం ఖాళీ చేయాలనీ పోలీసులు కోరుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోను శిబిరాల్లోంచి కదిలేది లేదంటున్నారు రైతులు. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేపు సాయంత్రం వరకు టెంట్లు తీసేది లేదని తేల్చి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. మంత్రి బొత్స […]

క్యాపిటల్ వార్: కొనసాగుతున్న రైతుల మహా ధర్నా!
Follow us on

రాజధాని రైతుల పోరాటం కొనసాగుతోంది.  రైతుల రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్ళూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. తాము శిబిరాల్లోంచి కదిలేది లేదంటూ రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమయం ముగిసింది శిబిరం ఖాళీ చేయాలనీ పోలీసులు కోరుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోను శిబిరాల్లోంచి కదిలేది లేదంటున్నారు రైతులు. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేపు సాయంత్రం వరకు టెంట్లు తీసేది లేదని తేల్చి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. మంత్రి బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.