గులాం నబీ ఆజాద్ కి శ్రీనగర్లో నో ఎంట్రీ ! మళ్ళీ ఢిల్లీకి ?

|

Aug 08, 2019 | 3:29 PM

ఆర్టికల్ 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం. జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు శ్రీనగర్ చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పోలీసులు అక్కడి విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచేందుకే ప్రభుత్వం ఈ అధికరణాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. మాజీ సీఎం లు మెహబూబా ముప్తీ, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలకు గృహ నిర్బంధం విధించడం […]

గులాం నబీ ఆజాద్ కి శ్రీనగర్లో నో ఎంట్రీ ! మళ్ళీ ఢిల్లీకి ?
Follow us on

ఆర్టికల్ 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం. జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు శ్రీనగర్ చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పోలీసులు అక్కడి విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచేందుకే ప్రభుత్వం ఈ అధికరణాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. మాజీ సీఎం లు మెహబూబా ముప్తీ, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలకు గృహ నిర్బంధం విధించడం ద్వారా వారి ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.

దాదాపు 400 మందిని అదుపులోకి తీసుకోవడంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో సామాన్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని చూపేందుకా అన్నట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కేంద్రం ఇక్కడికి పంపిందని, ఆయన స్థానికులతో మమేకమవుతూ .. ‘ అంతా బాగానే ఉందన్నట్టు ‘ సీన్ సృష్టించడానికే ప్రయత్నిస్తున్నారని గులాం నబీ ఆజాద్ దుయ్యబట్టారు. నిజానికి ఇక్కడి ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారని, అజిత్ దోవల్ స్థానికులతో కలిసి వీధి భోజనం చేస్తూ ఉంటే వెనుక షాపులు ఎందుకు మూసి ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్టు బతుకుతున్నారని అన్నారు. అజిత్ దోవల్ ఓ సామాన్య వ్యక్తిలా షోపియన్ జిల్లాలోని పేవ్ మెంట్ పై స్థానికులతో కలిసి ప్లేట్ మీల్స్ తింటున్న ఫోటోలను ఆయన చూపుతూ.. ‘ డబ్బులిచ్చి మీరు ఎవరినైనా కలుసుకోవచ్ఛు ‘ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా-గులాం నబీ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ నేతలు కావాలనే కశ్మీర్ పర్యటనను సాకుగా చూపి ఈ అధికరణం రద్దుపై ప్రజలను రెచ్ఛగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.