
తమ అధికారులెవరూ క్వారంటైన్‌లో లేరని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) వివరణ ఇచ్చింది. అడిషనల్ డైరెక్టర్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో పీఏసీ చైర్మన్, సభ్యులు, కాగ్ క్వారంటైన్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను కాగ్ అధికారులు ఖండించారు.
కాగ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈనెల 10న జరిగిన పీఏసీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పీఏసీ చైర్మన్ అధీర్ రంజన్ చౌదరి, కాగ్, డిప్యూటీ కాగ్ సహా 17 మంది ఎంపీలు హాజరయ్యారు. ఏడీజీకి కొవిడ్ సోకడంతో మీటింగ్ కు హాజరైన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరినట్లు ఓ వార్తా కథనం వెలువడింది. దీనిపై కాగ్ వివరణ ఇస్తూ, క్వారంటైన్‌లో ఉండాలని కాగ్‌ను అడిగినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, పైగా తప్పుదారిపట్టించేలా ఉందని తెలిపింది. ఇలాంటి నిరాధార వార్తల వల్ల అనవసరమైన అపోహలు తలెత్తాయని పేర్కొంది, కాగ్ కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారులకు కూడా ఇబ్బంది కలిగించినట్టు అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.