వైసీపీకి డిప్యూటీ స్పీకర్..ఆమెకు లైన్ క్లియరా?

భారీ మెజార్టీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఏపీలో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్‌కు తెలియజేశారని, అందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవిని గిరిజన ఎంపీకి ఇచ్చే దిశగా జగన్ యోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తలు నిజమైతే.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని […]

వైసీపీకి డిప్యూటీ స్పీకర్..ఆమెకు లైన్ క్లియరా?

Updated on: Jun 11, 2019 | 8:15 PM

భారీ మెజార్టీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఏపీలో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్‌కు తెలియజేశారని, అందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవిని గిరిజన ఎంపీకి ఇచ్చే దిశగా జగన్ యోచిస్తున్నారని సమాచారం.

ఈ వార్తలు నిజమైతే.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని ఈ పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. 17వ లోక్ సభలో పిన్న వయస్కురాలైన ఎంపీ మాధవి అనే సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలుపొందిన బీజేపీ సొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కమలనాథులకు లోక్ సభలో వేరే పార్టీ అవసరం లేదు. కానీ రాజ్యసభలో మాత్రం బీజేపీ బలం తక్కువగా ఉంది. దీంతో కీలక బిల్లులను పాస్ చేసే విషయంలో మోదీ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ ఇదే పరిస్థతి ఉండనుంది. దీంతో ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

అదీగాకుండా.. మంత్రి పదవుల విషయంలో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని జేడీయూ అలకబూనింది. బిహార్ బయట బీజేపీతో పొత్తులుండవని చెబుతోంది. దీంతో జేడీయూ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్సీపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పార్టీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us