బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిందా? టీఆర్ఎస్ ఎంపీలను ఆపార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తుందా? ఏపీలో అధికార వైసీపీకి రాబోయే రోజుల్లో ప్రతికూల పరిస్థితులే ఎదురుకాబోతున్నాయా? బీజేపీలో తెలుగురాష్ట్రాల ప్రతినిధులుగా ఉన్న నేతలు ఇద్దరిమధ్య గ్యాప్ వచ్చిందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలపై బీజేపీ సీనియర్ నేత, ఆపార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు చెప్పిన సమాధానాలేమిటి?
భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అనుసరించబోతున్న అనేక అంశాలపై ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో ఆసక్తికరమైన చర్చ సాగింది. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 8.30 గం.లకు టీవీ9లో ప్రసారం కాబోతుంది.