25 ఏళ్లకే ఎంపీగా…

| Edited By:

May 26, 2019 | 4:37 PM

పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్న అతిపిన్న అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ రికార్డు సృష్టించింది. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన చంద్రాని ముర్ము ఈ ఘనత సాధించింది. చంద్రాని ముర్ము అనే మహిళ వయసు దాదాపు 25 ఏళ్లు మాత్రమే.  ఒడిశాలోని కియోంఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముర్ము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనంత నాయక్‌పై 66,203 ఓట్ల మెజారిటీతో […]

25 ఏళ్లకే ఎంపీగా...
Follow us on

పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్న అతిపిన్న అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ రికార్డు సృష్టించింది. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన చంద్రాని ముర్ము ఈ ఘనత సాధించింది.

చంద్రాని ముర్ము అనే మహిళ వయసు దాదాపు 25 ఏళ్లు మాత్రమే.  ఒడిశాలోని కియోంఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముర్ము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనంత నాయక్‌పై 66,203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘గిరిజనుల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉందని. వారికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖనిజాలు పుష్కలంగా ఉన్న తన నియోజకవర్గంలో నిరుద్యోగసమస్య తీవ్రంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేసారు. ఈ సమస్యపై పార్లమెంట్‌లో పోరాడుతానని ఆమె అన్నారు.