‘ఈ అరణ్య రాజు’ పట్ల అప్రమత్తం అవసరం’, తేజస్వి యాదవ్ పై మోదీ సెటైర్

ఈ’ జంగిల్ రాజ్’ కి (అరణ్య రాజ్యానికి) ‘యువరాజైన’ వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ఓటర్లను కోరారు. బుధవారం ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో.. మోదీ.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ని జంగిల్ రాజ్ కి యువరాజ్ గా అభివర్ణించారు. ఇప్పటికే కరోనా వైరస్ పై ఈ రాష్ట్రం పోరాడుతోందని, ఇక జంగిల్ రాజ్ వస్తే ప్రజలకు రెట్టింపు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. కిడ్నాపింగులకు ఆర్జేడీ కాపీ […]

ఈ అరణ్య రాజు పట్ల అప్రమత్తం అవసరం, తేజస్వి యాదవ్ పై మోదీ సెటైర్

Edited By:

Updated on: Oct 28, 2020 | 5:20 PM

ఈ’ జంగిల్ రాజ్’ కి (అరణ్య రాజ్యానికి) ‘యువరాజైన’ వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ఓటర్లను కోరారు. బుధవారం ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో.. మోదీ.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ని జంగిల్ రాజ్ కి యువరాజ్ గా అభివర్ణించారు. ఇప్పటికే కరోనా వైరస్ పై ఈ రాష్ట్రం పోరాడుతోందని, ఇక జంగిల్ రాజ్ వస్తే ప్రజలకు రెట్టింపు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. కిడ్నాపింగులకు ఆర్జేడీ కాపీ రైట్ అని కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చిన వారిని తిరిగి ఎన్నుకోవడానికి ఇది మీకు మంచి అవకాశమన్నారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఆర్జేడీ హామీ గురించి మోదీ ప్రస్తావిస్తూ..’ప్రభుత్వ రంగంలో జాబ్స్ మాట అలా ఉంచండి..ఉద్యోగాలు ఇస్తున్న ప్రైవేటు కంపెనీలు కూడా భయంతో ఇవ్వలేక పారిపోతాయి’  అని వ్యాఖ్యానించారు.

 

 

Follow Us