లాలూ యాదవ్ పై బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ ఫిర్యాదు, మ్యాటర్ సీరియస్

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లాలూపై ఎఫ్ ఐ ఆర్ నమోదయింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సమయంలో..

  • Umakanth Rao
  • Publish Date - 9:53 pm, Thu, 26 November 20
లాలూ యాదవ్ పై బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ ఫిర్యాదు, మ్యాటర్ సీరియస్

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లాలూపై ఎఫ్ ఐ ఆర్ నమోదయింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సమయంలో సభకు గైర్ హాజరు కావాలని, ఇలా చేస్తే.. ఆర్జేడీ అధికారంలోకి వచ్చ్చినప్పుడు మీకు మంత్రి  పదవి ఇస్తామని రాంచీ లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ….పాశ్వాన్ కి ఫోన్  చేసినట్టు చెబుతున్న ఆడియో క్లిప్ వైరల్ అయింది. అయితే ఇది ప్రజా తీర్పును అవమానపరచడమేనని, తన  ఓటును కొనుక్కోవాలనుకోవడమేనని పాశ్వాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రజా సేవకుడినైన తనకుతాయిలం ఇవ్వజూపారని ఆయన అన్నారు. జైల్లో ఉన్న లాలూ చేసిన ఈ పని ఎంతమాత్రం సముచితం కాదన్నారు. కాగా-జార్ఖండ్ ప్రభుత్వం ఈ ఆడియో టేపు వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించింది. ఇది నిరూపితమైతే ఆయనపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు.