సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం.. నష్టమెంత.. లాభమెంత?

తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌గా మార్చుతామన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం దుమారం రేపుతోంది. ఇంగ్లీష్‌కు వెళ్లడం అంటే.. మాతృ భాషను చంపేయడమేనని భాషాభిమానులు, ప్రాంతీయ నేతలు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ స్కూల్స్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని కౌంటర్ ఇస్తోంది. సర్కారీ స్కూల్స్.. ఇంగ్లీష్ బడులుగా మారితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టమనే దానిపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది. ఈ చర్చలో సామాజికవేత్త, […]

  • Ravi Kiran
  • Publish Date - 9:53 pm, Thu, 7 November 19
సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం.. నష్టమెంత.. లాభమెంత?

తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌గా మార్చుతామన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం దుమారం రేపుతోంది. ఇంగ్లీష్‌కు వెళ్లడం అంటే.. మాతృ భాషను చంపేయడమేనని భాషాభిమానులు, ప్రాంతీయ నేతలు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ స్కూల్స్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని కౌంటర్ ఇస్తోంది. సర్కారీ స్కూల్స్.. ఇంగ్లీష్ బడులుగా మారితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టమనే దానిపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది. ఈ చర్చలో సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో పాటుగా ఉపాధ్యా సంఘాల ఎమ్మెల్సీ, టీడీపీ నేత రామకృష్ణ, ఆంధ్రభాషా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, వైసీపీ నేత ఈదా రాజశేఖర్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు..  వారిలో ఎంతమంది తెలుగు మీడియంపై మక్కువ చూపుతున్నారో.. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

 

 

 

సర్కారీ బడులను ఇంగ్లీష్ స్కూల్స్‌గా మార్చడాన్ని ప్రొఫెసర్ కంచె ఐలయ్య సమర్ధించగా.. చలసాని శ్రీనివాస్ మాత్రం ఇది సరైన నిర్ణయం కాదని… ఇందువల్ల మాతృభాషా మరుగునపడిపోతుందని అన్నారు. ఇక వీరిద్దరి మధ్య ఈ అంశంపై తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది.

విద్యా వ్యవస్థను సమతుల్యంగా నడపాలనే ధ్యేయంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఐలయ్య అన్నారు. ఇంగ్లీష్ స్కూల్స్‌ను వ్యతిరేకిస్తున్న వారు.. 82% అగ్ర వర్ణాలు సర్కారీ బడులను కాదని ప్రైవేట్ స్కూల్స్‌లో ఎందుకు చదివిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అటు ఈ విషయాన్ని చలసాని శ్రీనివాస్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచమంతా ఒకసారి చూస్తే.. అన్ని దేశాల్లోని విద్యార్థులందరూ వారి స్థానిక భాషల్లోనే చదువుకుని అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు.

మరోవైపు ఐలయ్య మాట్లాడుతూ.. ‘భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే భాషలో విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి నాంది’ పలికారన్నారు. అయితే చలసాని శ్రీనివాస్ మాత్రం తెలుగు బాషా మీద నిషేధం విధించవద్దని.. ఇంగ్లీష్ భాషను ఆప్షన్‌గా ఇస్తే బాగుంటుందని అన్నారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన చర్చ వారి మాటల్లోనే…