బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. గవర్నర్‌కు డెడ్‌లైన్స్ ఉండవు…

రాజకీయాల్లో నైతిక విలువలు, పార్టీ చీలికలు, నెంబర్‌గేమ్‌ అనేది ముఖ్యమని చెప్పింది నాటి కర్ణాటక రాజకీయాలు అయితే.. వాటిని అధిగమిస్తూ.. ఇప్పటి మహారాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేయడం.. ఆ తర్వాత సీట్ల విషయంలో గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది. అయితే అనుకోని విధంగా మహా రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఎన్‌సీపీ టికెట్‌ మీద గెలిచిన అజిత్‌ పవార్‌ ఎల్పీ లీడర్‌ హోదాలో బీజేపీతో […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. గవర్నర్‌కు డెడ్‌లైన్స్ ఉండవు...
Ravi Kiran

|

Nov 25, 2019 | 11:55 PM

రాజకీయాల్లో నైతిక విలువలు, పార్టీ చీలికలు, నెంబర్‌గేమ్‌ అనేది ముఖ్యమని చెప్పింది నాటి కర్ణాటక రాజకీయాలు అయితే.. వాటిని అధిగమిస్తూ.. ఇప్పటి మహారాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేయడం.. ఆ తర్వాత సీట్ల విషయంలో గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది. అయితే అనుకోని విధంగా మహా రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఎన్‌సీపీ టికెట్‌ మీద గెలిచిన అజిత్‌ పవార్‌ ఎల్పీ లీడర్‌ హోదాలో బీజేపీతో జతకట్టడం- మహారాష్ట్రలో గందరగోళాన్ని సృష్టించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాంగ్రెస్‌ పార్లమెంటు ఆవరణలో ప్లకార్డుల ప్రదర్శనకు దిగింది. అయితే, జంపింగ్‌ల ఎపిసోడ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఎలాగన్న దానిపై టీవీ9 వేదికగా బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ జరిగింది.

ఇక ఈ చర్చలో పాల్గొన్న బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి.. మహారాష్ట్ర రాజకీయాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ రాష్ట్రంలో కూడా మన రాజ్యాంగంలో ఒక గవర్నర్ వ్యవస్థ అనేది ముఖ్యంగా ఉండాలని నాలుగు అధికరణలు చెబుతున్నాయి. అధికరణ 153 ప్రకారం.. ప్రతీ స్టేట్‌కు ఒక గవర్నర్ ఉండాలి.. అధికరణ 154 ప్రకారం.. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం మొత్తం అంతా గవర్నర్ చేతుల్లోనే ఉంటుంది. అధికరణ 163 ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ తన విధులను నిర్వర్తించడంలో.. సహాయపడటానికి, సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రితో కూడిన ఒక మంత్రి మండలి ఉండాలి. అధికరణ 164 ప్రకారం.. మంత్రుల మండలి(ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులతో సభ్యులుగా ఏర్పడింది) శాసనసభకు “సమిష్టిగా” బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఇంకా మరిన్ని విషయాలు మహా రాజకీయాల గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే…

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu