రాజధాని తరలింపును కేంద్రం అడ్డుకుంటుందా..?

|

Jan 21, 2020 | 10:45 PM

ఏపీలో రాజధానుల హీట్ మరింత పెరిగింది. ఒకవైపు శాసనసభలో అధికార వైసీపీ 3 రాజధానుల బిల్లును పాస్ చేసింది. మరోవైపు మండలిలో కూడా బిల్లును ఆమోదింపజేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతుల నిరసనలు మాత్రం ఆగడం లేదు. బీజేపీ పాత మిత్రుడు చంద్రబాబు రాజధాని కోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తానంటూ సవాల్ చేస్తోన్నారు. మరోవైపు బీజేపీ కొత్త మిత్రుడు పవన్ కళ్యాణ్..రాజధాని తరలింపును అడ్డుకుంటానంటూ, అమరావతిలోనే ఉంటుందంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. వీరే […]

రాజధాని తరలింపును కేంద్రం అడ్డుకుంటుందా..?
Follow us on

ఏపీలో రాజధానుల హీట్ మరింత పెరిగింది. ఒకవైపు శాసనసభలో అధికార వైసీపీ 3 రాజధానుల బిల్లును పాస్ చేసింది. మరోవైపు మండలిలో కూడా బిల్లును ఆమోదింపజేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే రాజధానిని తరలించవద్దంటూ అమరావతి రైతుల నిరసనలు మాత్రం ఆగడం లేదు. బీజేపీ పాత మిత్రుడు చంద్రబాబు రాజధాని కోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తానంటూ సవాల్ చేస్తోన్నారు. మరోవైపు బీజేపీ కొత్త మిత్రుడు పవన్ కళ్యాణ్..రాజధాని తరలింపును అడ్డుకుంటానంటూ, అమరావతిలోనే ఉంటుందంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. వీరే కాదు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సైతం సరైన సమయంలో కేంద్రం జగన్‌కు ఝలక్ ఇస్తుందని పదే, పదే అంటున్నారు. అసలు ఈ ఇష్యూపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్టాండ్ ఏంటి?..రాజధాని విషయంలో బీజేపీ జోక్యం ఉంటుందా..? అనే అంశాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ను సూటిగా ప్రశ్నించారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. దీనిపై బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా జీవీఎల్ సమాధానాలు ఇచ్చారు.

అయితే ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ పోరాటం చేయడం తప్ప పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదని ఇన్ డైరెక్ట్‌గా చెప్పుకొచ్చారు. కేంద్రానికి కొన్ని పరిధులు ఉంటాయని, రాష్ట్రాలకు సంబందించిన కొన్ని అంశాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. గతంలో చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా నియంత్రించినప్పుడు కూడా కేంద్రం పెద్దగా కలగజేసుకోలేదని గుర్తు చేశారు. ఆయన చెప్పిన మరిన్ని విషయాలు దిగువ వీడియోలో చూడండి.