లాక్ డౌన్ వేళలో.. త‌ప్ప‌తాగి.. పోలీసుల‌పై యువ‌తుల వీరంగం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ సమయంలో పీకాలదాక తాగిన యువతులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులపై వాహనాన్ని దూకించే ప్రయత్నం చేశారు. 

లాక్ డౌన్ వేళలో.. త‌ప్ప‌తాగి.. పోలీసుల‌పై యువ‌తుల వీరంగం..

Edited By:

Updated on: Apr 20, 2020 | 3:40 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ సమయంలో పీకాలదాక తాగిన యువతులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులపై వాహనాన్ని దూకించే ప్రయత్నం చేశారు.  ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు నగరంలో అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.  శనివారం సాయంత్రం నలుగురు యువతులు మద్యం సేవించి కారులో ప్రయాణిస్తూ లీలా ప్యాలెస్‌ సమీపంలో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు.

కాగా.. పోలీసులు వాహనాన్ని నిలిపి  తనిఖీ చేస్తుండగా తమ వద్ద పాస్‌ ఉందని, మాకు ఉన్నతాధికారులు తెలుసంటూ యువతులు వాదనకు దిగారు. మద్యం తాగినట్లు అనుమానం రావడంతో బ్రీతింగ్‌ అనలైజర్‌తో తనిఖీ చేయడానికి యత్నించగా యువతులు పోలీసులపైకి వాహనాన్ని దూకించే యత్నం చేసి ఉడాయించారు. పోలీసులు బైక్‌పై కిలోమీటర్‌ దూరం వరకు వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..