‘ధూమ్’ తరహాలో బ్యాంకును దోచి.. ప్రజలకు పంచాడు..!

ఓ దొంగ చాకచక్యంగా బ్యాంకులోకి అడుగుపెట్టి డబ్బును మొత్తం కొల్లగొట్టి జనంపైకి వెదజల్లాడు. ఈ సీన్ ఏదో సినిమాలో చూసినట్టు ఉందని అనుకుంటున్నారా. నిజమేనండీ ఇది ‘ధూమ్ 3’ సన్నివేశం. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి సీన్ రియల్‌లో జరిగింది. క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు ఓ తెల్లగడ్డం వృద్ధుడు బ్యాంక్‌ను దోచేసి.. జనంపైకి డబ్బులు వెదజల్లాడు. ఇప్పుడు ఈ వార్త అమెరికా మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. 65 ఏళ్ల డేవిడ్ […]

ధూమ్ తరహాలో బ్యాంకును దోచి.. ప్రజలకు పంచాడు..!

Updated on: Dec 26, 2019 | 9:00 PM

ఓ దొంగ చాకచక్యంగా బ్యాంకులోకి అడుగుపెట్టి డబ్బును మొత్తం కొల్లగొట్టి జనంపైకి వెదజల్లాడు. ఈ సీన్ ఏదో సినిమాలో చూసినట్టు ఉందని అనుకుంటున్నారా. నిజమేనండీ ఇది ‘ధూమ్ 3’ సన్నివేశం. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి సీన్ రియల్‌లో జరిగింది. క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు ఓ తెల్లగడ్డం వృద్ధుడు బ్యాంక్‌ను దోచేసి.. జనంపైకి డబ్బులు వెదజల్లాడు. ఇప్పుడు ఈ వార్త అమెరికా మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

65 ఏళ్ల డేవిడ్ వెయినే అలివర్ అనే వృద్ధుడు కోలొరడా స్ప్రింగ్స్‌లోని ఆకాడమీ బ్యాంకులోకి చొరబడి ఆయుధంతో ఉద్యోగులను బెదిరించి డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఇక ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకు నుంచి బయటికి వచ్చిన అతడు తన బ్యాగ్‌లో నుంచి డబ్బులు తీసి జనంపైకి వెదజల్లుతూ ‘మేరీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్’ అని చెప్పాడని వారు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.