మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ ఈ మార్చిలోనే..! రంజీ ట్రోఫీకి ఓకే అంటున్న బీసీసీఐ చీఫ్ దాదా..!

|

Jan 19, 2021 | 7:08 AM

మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ను ఈ మార్చిలో ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. కానీ ఈసారి రంజీ ట్రోఫీ నిర్వహించాలా లేదా విజయ్​ హజారేతో...

మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ ఈ మార్చిలోనే..! రంజీ ట్రోఫీకి ఓకే అంటున్న బీసీసీఐ చీఫ్ దాదా..!
Follow us on

BCCI undecided : మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ను ఈ మార్చిలో ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. బోర్డు అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. కానీ ఈసారి రంజీ ట్రోఫీ నిర్వహించాలా లేదా విజయ్​ హజారేతో సర్దుబాటు చేయాలా అన్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. వీలైనంత త్వరగా రంజీ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పట్టుదలతో ఉన్నారు. కానీ కొంత మంది సభ్యులు మాత్రం విజయ్​ హజారెకు ఓటు వేస్తున్నారు.

రంజీ ట్రోఫీని యథావిధిగా నిర్వహించాలని అధ్యక్షుడు గంగూలీ భావిస్తున్నారు. కానీ దీనికి బదులు విజయ్​ హజారె నిర్వహిస్తే మేలని కొందరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివిధ వేదికల్లో రంజీ ట్రోఫీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. రంజీనా లేక విజయ్​ హజారేనా అనేది వచ్చే వారం చివర్లో తేలనుంది. అయితే మహిళల దేశవాళీ క్రికెట్​ మార్చిలో ఆరంభమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బంగ్లాదేశ్ పట్ల భారత్ మరోసారి ఔదార్యం.. రెండు మిలియన్ డోసుల వ్యాక్సిన్ బహుమతి..

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ… ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ సభ్యులు

దశాబ్ధాలు కాదు.. శతాబ్ధం.. ఏకంగా 110 ఏళ్లనాటి రికార్డులకు బ్రేక్.. శార్దూల్‌, సుందర్‌ జోడీ అదుర్స్ ..