No Need to Move : సిడ్నీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రోహిత్ శర్మ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే రోహిత్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. దీనిపై బీసీసీఐ స్పందించింది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది. అక్కడ రోహిత్ సురక్షితంగానే ఉన్నాడని పేర్కొంది.
ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సరీస్ కోసం రోహిత్ శర్మ కొద్ది రోజుల క్రితమే సిడ్నీ చేరుకున్నాడు. అయితే కరోనా వైరస్ నిబంధనల మేరకు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. దాంతో రోహిత్ ప్రస్తుతం సిడ్నీలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు.
గత కొద్దిరోజులుగా సిడ్నీలో కోవిడ్ వ్యాప్తి వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోవడంతో ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీ సరిహద్దుల్ని మూసివేసివేసింది. కఠినంగా నిబంధనల్ని అమలు చేస్తోంది. అయితే సిడ్నీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడే ఉన్న రోహిత్ శర్మకు కూడా కరోనా సోకుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.