ఐపీఎల్‌కు స్పాన్సర్లు కావాలెను.. దరఖాస్తు చేసుకోండి.!

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా సంస్థ వివో తప్పుకోవడంతో ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్‌కు స్పాన్సర్లు కావాలెను.. దరఖాస్తు చేసుకోండి.!

Updated on: Aug 10, 2020 | 11:39 PM

IPL 13th Season Title Sponsor: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదిక ఈ టోర్నీ జరగనుంది. కట్టుదిట్టమైన చర్యలతో ‘బయో సెక్యూర్ బబుల్’లో ఈ ఏడాది ఐపీఎల్ జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఆటగాళ్లందరూ కూడా ఈ నెల 20వ తేదీన యూఏఈ పయనం కానున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా సంస్థ వివో తప్పుకోవడంతో ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు మాత్రమే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఎంపికైన సంస్థకు ఆగష్టు 18, 2020 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు మాత్రమే హక్కులు ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక స్పాన్సర్‌షిప్ విలువను రూ. 300 కోట్లుగా నిర్ణయించింది. కాగా, ఈ ఐపీఎల్ 13వ సీజన్ స్పాన్సర్‌షిప్ కోసం కోకాకోలా, బైజూస్, జియో, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు రేసులో ఉన్నాయి. అలాగే తాజాగా పతంజలీ కూడా బిడ్ వేయనున్నట్లు తెలుస్తోంది. అటు వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 14వ సీజన్ మెగా అక్షన్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఎనిమిది ఫ్రాంచైజీలూ ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లనే కంటిన్యూ చేయనున్నారని సమాచారం.