New Teams IPL 2022: ఐపీఎల్ 2022లో పది టీమ్స్.. బీసీసీఐ ఆమోదముద్ర.. పెరగనున్న మ్యాచ్‌ల సంఖ్య..

New Teams IPL 2022: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త జట్లు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. 2021 ఐపీఎల్‌కు తక్కువ సమయం ఉండటంతో

New Teams IPL 2022: ఐపీఎల్ 2022లో పది టీమ్స్.. బీసీసీఐ ఆమోదముద్ర.. పెరగనున్న మ్యాచ్‌ల సంఖ్య..
ipl-2021

Updated on: Dec 24, 2020 | 4:55 PM

New Teams IPL 2022: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త జట్లు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. 2021 ఐపీఎల్‌కు తక్కువ సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు టెండర్లు పిలిచి.. వేలం నిర్వహించడం సాధ్యపడదని భావించిన బీసీసీఐ.. ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లను ఆడించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర వేసింది.

ఆ రెండు జట్లు ఏవి అనేది తెలియాల్సి ఉండగా.. గుజరాత్ జట్టు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ప్రముఖ దిగ్గజ వ్యాపారస్తులు గౌతమ్ అదానీ, సంజీవ్ గోయెంకాలు కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వినికిడి. కాగా, టోర్నీలో పది జట్లు పాల్గొంటే.. మ్యాచ్‌లు సంఖ్య 94కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే టోర్నమెంట్‌ను రెండున్నర నెలలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఈ విషయాలపై బీసీసీఐ ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నది వేచి చూడాలి.

Also Read:

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్