Breaking: ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది..

కరోనా విరామం తర్వాత యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

Breaking: ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది..

Updated on: Sep 10, 2020 | 5:29 PM

కరోనా విరామం తర్వాత యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఈ లీగ్‌లో మొదటి మ్యాచ్ అబుదాబీలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరగనుంది. ఇక ఆ తర్వాత రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య దుబాయ్‌లో.. అలాగే మూడో మ్యాచ్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుంది. (Dream 11 IPL 2020 Schedule)

ఇక సెప్టెంబర్ 22 రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ యాక్షన్ షార్జాకు షిఫ్ట్ అవుతుందని బీసీసీఐ పేర్కొంది. ఈసారి 10 డబుల్ డెక్కర్ మ్యాచులు ఉండగా.. సాయంత్రం మ్యాచులు(మధ్యాహ్నం 3.30 నిముషాలకు), అలాగే నైట్ మ్యాచులు అరగంట(రాత్రి 7.30కి) ముందు మొదలు కానున్నాయి. ఈ లీగ్ మొత్తంలో 24 మ్యాచులు దుబాయ్‌, 20 మ్యాచులు అబుదాబీ,. 12 మ్యాచులు షార్జాలో జరుగనున్నాయి. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల డేట్స్‌ వివరాలను మాత్రమే విడుదల చేయగా.. మరికొద్ది రోజుల్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించనుంది.