రోహిత్‌కు దక్కని చోటు..భారత జట్టు ఎంపిక

ఆస్ట్రేలియాలో టూర్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మెట్లకు జట్లను ఎంపిక చేసింది. జట్టులో కొన్ని మార్పులను చేసింది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో రెస్ట్‌ ఇచ్చింది బీసీసీఐ. రోహిత్‌ లేకపోవడంతో టీ20, వన్డే క్రికెట్‌ జట్లకు కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక టెస్ట్ మ్యాచులకు మాత్రం అజింక్య రహానెను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టెస్టు జట్టులో […]

రోహిత్‌కు దక్కని చోటు..భారత జట్టు ఎంపిక
Sanjay Kasula

|

Oct 26, 2020 | 10:52 PM

ఆస్ట్రేలియాలో టూర్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మెట్లకు జట్లను ఎంపిక చేసింది. జట్టులో కొన్ని మార్పులను చేసింది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో రెస్ట్‌ ఇచ్చింది బీసీసీఐ. రోహిత్‌ లేకపోవడంతో టీ20, వన్డే క్రికెట్‌ జట్లకు కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక టెస్ట్ మ్యాచులకు మాత్రం అజింక్య రహానెను వైస్‌ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది.

హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టెస్టు జట్టులో ఐదో పేసర్‌గా ఎంపికయ్యాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతాకు ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి టీ20 జట్టులో చోటు దక్కింది. రిషభ్ పంత్‌కు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కలేదు. రోహిత్‌ శర్మతో పాటు ఇంతకు ముందే గాయపడ్డ ఇషాంత్‌ శర్మ బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉండనున్నారు. నవంబర్ ‌27 నుంచి పర్యటన మొదలవ్వనుంది.

టీ20 జట్టు సభ్యులు: విరాట్‌ కోహ్లీ (కె), శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి

వన్డే జట్టు సభ్యులు: విరాట్‌ కోహ్లీ (కె), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్ ‌కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌

టెస్టు జట్టు సభ్యులు: విరాట్‌ కోహ్లీ (కె), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, షమి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ ‌సిరాజ్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu