బాపట్ల టీడీపీ ఇంచార్జ్ నరేంద్ర వర్మ మాజీ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..ట్విస్ట్ ఏంటంటే..

|

Jul 15, 2020 | 9:14 AM

గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఇంచార్జ్ నరేంద్ర వర్మ మాజీ కారు డ్రైవర్ వీరేష్ నిద్ర మాత్రలు ‌మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. స్థల వివాదం నేపథ్యంలో నేత అనుచరులు బెదిరించారని అత‌డు మ‌న‌స్తాపం చెందిన‌ట్లు తెలుస్తోంది.

బాపట్ల టీడీపీ ఇంచార్జ్ నరేంద్ర వర్మ మాజీ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..ట్విస్ట్ ఏంటంటే..
Follow us on

గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఇంచార్జ్ నరేంద్ర వర్మ మాజీ కారు డ్రైవర్ వీరేష్ నిద్ర మాత్రలు ‌మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థల వివాదం నేపథ్యంలో నేత అనుచరులు బెదిరించారని అత‌డు మ‌న‌స్తాపం చెందిన‌ట్లు తెలుస్తోంది. గతంలో నాలుగు సెంట్లు స్థలాన్ని విరేష్ పేరుతో రాశాడు‌ నరేంద్ర వర్మ. తిరిగి ఆ స్థలాన్ని రాయాలంటూ నరేంద్ర వర్మ అనుచరుల బెదిరింపులు దిగిన‌ట్టు స‌మాచారం. దీనిపై నరేంద్ర వర్మతో పాటు ఆయ‌న ముగ్గురు అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.