జాతీయ పతాకం ఆవిష్కరించిన బాలకృష్ణ

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దేశప్రజలకు నందమూరి నట సింహం బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ పతాకం ఆవిష్కరించిన బాలకృష్ణ

Updated on: Aug 15, 2020 | 11:14 PM

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దేశప్రజలకు నందమూరి నట సింహం బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బసవ తారకం కాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు. ఈ ఉదయం చిరు జల్లలు పడుతున్నా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలతో నలిగిపోయిన భారతావనిని కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us