‘సాహో’ కోసం అవన్నీ వదిలేశాః ప్రభాస్

ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ ఫీవర్ పట్టుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ బాగా శ్రమించాడని చెప్పవచ్చు. ‘బాహుబలి’ సినిమాకు వంద కిలోలకు పైగా బరువు పెరిగిన అతడు.. ‘సాహో’ కోసం సిక్స్ ప్యాక్ బాడీ చేయాల్సి వచ్చింది. అందుకోసం ప్రభాస్ ఏకంగా నాన్‌వెజ్ మానేసి.. బాగా కసరత్తులు చేశాడు. ‘బాహుబలి’ పూర్తయిన […]

  • Ravi Kiran
  • Publish Date - 12:48 pm, Thu, 22 August 19
'సాహో' కోసం అవన్నీ వదిలేశాః ప్రభాస్

ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ ఫీవర్ పట్టుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ బాగా శ్రమించాడని చెప్పవచ్చు. ‘బాహుబలి’ సినిమాకు వంద కిలోలకు పైగా బరువు పెరిగిన అతడు.. ‘సాహో’ కోసం సిక్స్ ప్యాక్ బాడీ చేయాల్సి వచ్చింది. అందుకోసం ప్రభాస్ ఏకంగా నాన్‌వెజ్ మానేసి.. బాగా కసరత్తులు చేశాడు. ‘బాహుబలి’ పూర్తయిన తర్వాత… ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభించడానికి మధ్య ప్రభాస్‌కు ఐదు నెలల టైమ్‌ లభించింది. అప్పుడు ఆయన పూర్తిగా నాన్‌వెజ్‌ మానేసి ప్యూర్ వెజిటేరియన్‌గా మారిపోయాడు. ‘ఐదు నెలల కఠిన శ్రమ తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చాయని స్వయంగా ప్రభాస్ తెలిపాడు. యువి క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.