దీపావళి రోజున దీపకాంతులో వెలిగిన అయోధ్య, గిన్నిస్‌ రికార్డు నిర్వాహకుల అభినందనలు

|

Nov 18, 2020 | 10:51 AM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యనగరం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.. మొన్న దీపావళి పండుగ రోజు సరయు నది ఒడ్డున లక్షలాది దీపాల కాంతులతో అయోధ్య నగరం వెలిగిపోయింది.. ఒకేసారి 6,06,569 దీపాలు అయిదు నిమిషాల పాటు రామ్‌కీ పైడీ ఘాట్ల దగ్గర వెలుగులు విరజిమ్మాయి.. అయోధ్య మెరిసిపోయింది.. ఆ శోభను చూసిన ప్రజలు మురిసిపోయారు.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నేతృత్వంలో తలపెట్టిన ఈ దీపోత్సవం గిన్నీస్‌ బుక్‌ రికార్డును కూడా సొంతం చేసుకుంది.. గిన్నిస్‌ బుక్‌ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ పర్యాటక […]

దీపావళి రోజున దీపకాంతులో వెలిగిన అయోధ్య, గిన్నిస్‌ రికార్డు నిర్వాహకుల అభినందనలు
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యనగరం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.. మొన్న దీపావళి పండుగ రోజు సరయు నది ఒడ్డున లక్షలాది దీపాల కాంతులతో అయోధ్య నగరం వెలిగిపోయింది.. ఒకేసారి 6,06,569 దీపాలు అయిదు నిమిషాల పాటు రామ్‌కీ పైడీ ఘాట్ల దగ్గర వెలుగులు విరజిమ్మాయి.. అయోధ్య మెరిసిపోయింది.. ఆ శోభను చూసిన ప్రజలు మురిసిపోయారు.. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నేతృత్వంలో తలపెట్టిన ఈ దీపోత్సవం గిన్నీస్‌ బుక్‌ రికార్డును కూడా సొంతం చేసుకుంది.. గిన్నిస్‌ బుక్‌ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ పర్యాటక రంగానికి, రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ విశ్వవిద్యాలయానికి అభినందనలు తెలిపారు.. గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులు 6,06,569 నూనె దీపాలు అయిదు నిమిషాలు వెలుగొందాయంటూ ట్వీట్‌ చేశారు. ఆ సుందర దృశ్యాలను షేర్‌ కూడా చేశారు. రామ్‌మనోహర్‌ లోహియా అవధ్‌ విశ్వవిద్యాలయానికి ఎందుకు అభినందనలు చెప్పాల్సి వచ్చిందంటే ఈ దీపోత్సవం విజయవంతం కావడానికి ఆ యూనివర్సిటీ విద్యార్థులే కారణం. సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు ఇందుకోసం తీవ్రంగా శ్రమించారు.. వారి కార్యదక్షతకు మెచ్చి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.. యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయోధ్యలో దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా దీపాల సంఖ్య పెరుగుతూనే ఉంది.. రికార్డులు చెరిగిపోతూనే ఉన్నాయి.