అయోధ్య భూమిపూజ ప్రసారాలపై అంక్షలు..!

అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరిగే రామమందిరం భూమిపూజ జరగనున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముఖ్యంగా భూమి పూజ కార్యక్రమాల ప్రసారాలపై టీవీ వార్తా చానళ్లకు పలు మార్గదర్శకాలు జారీచేసింది.

అయోధ్య భూమిపూజ ప్రసారాలపై అంక్షలు..!
Follow us

|

Updated on: Jul 30, 2020 | 1:44 AM

అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన జరిగే రామమందిరం భూమిపూజ జరగనున్న దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముఖ్యంగా భూమి పూజ కార్యక్రమాల ప్రసారాలపై టీవీ వార్తా చానళ్లకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. అయోధ్య నుంచి ప్రసారం చేసే చర్చా కార్యక్రమాల్లో ‘మందిరం–మసీదు వివాదం’ సంబంధించిన కక్షిదారులెవరూ ఉండరాదని షరతు విధించింది. భూమిపూజ రోజున చానళ్లు చేపట్టే చర్చలు, ఇతర కార్యక్రమాల్లో ఏమతానికీ లేదా వ్యక్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉండరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా చానళ్లు ముందుగా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అన్ని వార్తా చానళ్లకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు, రామజన్మ భూమి నిర్మాణంలో పాలుపంచుకోవాలనుకునే వారు వెండి తోపాటు ఇతర లోహాలతో తయారు చేసిన ఇటుకలను ఆలయానికి విరాళంగా ఇవ్వవద్దని రామాలయ ట్రస్టు కోరింది. భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు నుంచి ఇప్పటికే సేకరించిన ఒక క్వింటాల్‌ వెండి, ఇతర లోహాలతో తయారైన ఇటుకలను బహూకరించారని ఆలయ ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. వీటిని ఆలయంలో భద్ర పరచడానికి గానీ, ఈ ఇటుకల్లో స్వచ్ఛతను పరీక్షించడానికి గానీ తమ వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో విరాళాలను ఆలయ బ్యాంకు అకౌంట్‌లో జమ చేయాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అటు, రామజన్మ భూమి పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇళ్లల్లో ఉండి విక్షేంచాలని ఆలయ కమిటీ కోరింది.

Latest Articles
'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!

చక్రవర్తిలా పాలిస్తుంది ఎవరో తెలుసు: ప్రియాంక గాంధీ

నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..

ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు.. అటు మోత్కుపల్లి.. ఇటు

కలలో గుడ్లు కనిపించాయా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్..

ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా

కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్