బోసినవ్వుల బుడ్డోడు.. ఎందుకలా నవ్వాడు

| Edited By:

Aug 03, 2019 | 4:01 PM

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అందులో తన వ్యాపారానికి సంబంధించిన విషయాల కంటే అందరినీ నవ్వించే, అందరినీ ఆలోచింపజేసే ట్వీట్లే ఎక్కువగా పెడుతుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి షేర్ చేసుకున్నాడు ఆనంద్ మహీంద్రా. అందులో.. ఓ ఐదారు నెలలున్న ఓ బుడ్డోడికి సెలూన్‌లో ట్రిమ్మింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అమ్మ ఒళ్లో కూర్చొన్న ఆ బుడ్డోడు ఆపకుండా బోసినవ్వులు నవ్వుతూ.. తన కాళ్లను కదుపుతూ […]

బోసినవ్వుల బుడ్డోడు.. ఎందుకలా నవ్వాడు
Follow us on

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అందులో తన వ్యాపారానికి సంబంధించిన విషయాల కంటే అందరినీ నవ్వించే, అందరినీ ఆలోచింపజేసే ట్వీట్లే ఎక్కువగా పెడుతుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి షేర్ చేసుకున్నాడు ఆనంద్ మహీంద్రా.

అందులో.. ఓ ఐదారు నెలలున్న ఓ బుడ్డోడికి సెలూన్‌లో ట్రిమ్మింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అమ్మ ఒళ్లో కూర్చొన్న ఆ బుడ్డోడు ఆపకుండా బోసినవ్వులు నవ్వుతూ.. తన కాళ్లను కదుపుతూ ఉన్నాడు. వాడి నవ్వును అక్కడున్న అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎప్పుడైనా నిన్ను బాధపడ్డే సందర్భాలు ఎదురైనప్పుడు లేదా చదివినప్పుడు.. ఈ వీడియో కచ్చితంగా మీ పెదాలపై నవ్వును తీసుకొస్తుంది. ఆ తరువాత ప్రపంచమంతా నీకు మామూలుగా కనిపిస్తుంది. లేకపోతే నేను నా మనవడిని మిస్ అవుతున్నానేమో అంటూ కామెంట్ పెట్టాడు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్ బుడ్డోడా అంటూ తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.