అన్ని వైపుల నుంచి ముప్పు, అప్రమత్తత అవసరం, ఐఎఎఫ్ చీఫ్ భదౌరియా

| Edited By: Pardhasaradhi Peri

Nov 07, 2020 | 4:25 PM

దేశం అన్ని వైపులనుంచి ముప్పును ఎదుర్కొంటోందని, అందువల్ల సదా అప్రమత్తత అవసరమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్.కె. భదౌరియా అన్నారు. ఇందుకు సునిశిత విజ్ఞానం, అంకిత భావం, చిత్తశుద్ది, త్యాగనిరతి, నాయకత్వం ఎంతయినా అవసరమని ఆయన చెప్పారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 217 మంది కేడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన సాయుధ దళాలు ఈ విధమైన ముప్పును ఎదుర్కోవడానికి సంసిధ్ధంగా ఉండాలని,   ఉంటున్నాయని కూడా ఆయన […]

అన్ని వైపుల నుంచి ముప్పు, అప్రమత్తత అవసరం, ఐఎఎఫ్ చీఫ్ భదౌరియా
Follow us on

దేశం అన్ని వైపులనుంచి ముప్పును ఎదుర్కొంటోందని, అందువల్ల సదా అప్రమత్తత అవసరమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్.కె. భదౌరియా అన్నారు. ఇందుకు సునిశిత విజ్ఞానం, అంకిత భావం, చిత్తశుద్ది, త్యాగనిరతి, నాయకత్వం ఎంతయినా అవసరమని ఆయన చెప్పారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 217 మంది కేడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన సాయుధ దళాలు ఈ విధమైన ముప్పును ఎదుర్కోవడానికి సంసిధ్ధంగా ఉండాలని,   ఉంటున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. నేటి బ్యాటిల్ స్పేస్ అన్నది చాలా క్లిష్టతరమైనది..మనం ఏ మాత్రం ఊహించలేని సినేరియోతో కూడిన మల్టీ డైమెన్షన్ తో ఉంది ఇది అని భ దౌరియా తెలిపారు. ఈకారణంగా అలెర్ట్ అన్నది ఈ తరుణంలో ఎంతైనా ముఖ్యమని ఆయన పదేపదే పేర్కొన్నారు.