ఏపీఎస్‌ఆర్టీసీని(APSRTC) ప్రైవేటు వైపు తీసుకెళ్లే ఆలోచనలో భాగంగా ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో పడిందన్న వార్తలపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపు వల్ల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని.. అద్దె బస్సుల నిర్వహణ, డ్రైవర్ జీతభత్యాలు అంతా బస్సు యాజమాన్యాలదేనని వెల్లడించారు. ప్రజల ప్రయాణం సుఖవంతంగా ఉండేలా చూడటమే తన ప్రాధాన్యామని వివరించారు. కొత్త బస్సులు కొనడం కొంత ఇబ్బందిగా మారడంతో 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచినట్లు వివరించారు. అద్దె బస్సులు ఇవ్వాలనుకునే యజమానులు కచ్చితంగా కొత్తవే ఇవ్వాలని స్పష్టం చేశారు. మొదటిసారిగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్న ఆర్టీసీ ఎండీ.. అద్దె బస్సుల సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ ఆ బస్సుల యజమనులదేనన్నారు. అద్దె బస్సులు వల్ల ఏ ఒక్క ఉద్యోగి భద్రతకు భంగం వాటిల్లదని తెలిపారు.
కొన్ని రాష్ట్రాల్లో సీసీఎస్ బకాయిలు చెల్లించలేని పరిస్ధితి ఉంది. కానీ మేం ఆ బకాయిలు చెల్లించాం. ఇప్పటివరకు రూ.1,685 కోట్ల అప్పులు తీర్చాం. అద్దె బస్సులు విధులకు రాకపోయినా మేం బస్సులు నడపగలం. మేం నిస్సహాయ స్ధితిలో లేము. పెనాల్టీలు కఠినంగా ఉంటేనే ప్రజలకు ఉపయోగం. జనవరి 2016 నుంచీ 2019 డిసెంబరు వరకూ ఉన్న కారుణ్య నియామాకాలకు ప్రభుత్వం అనుమతించింది. 2020 జనవరి తరువాత ఉన్న కారుణ్య నియామకాలకు సిద్ధం చేస్తున్నాం. కారుణ్య నియామకాలు చేయాల్సిన లిస్టు సంబంధిత కలెక్టర్లకు పంపించాం. అద్దె బస్సుల టెండర్లకు గడువు పెంచుతాం.
– ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ
అద్దె బస్సుల సంఖ్య పెంచడం వల్ల వాణిజ్య పరంగా ఆర్టీసీకి లాభమేనని ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 23 శాతం అద్దె బస్సులున్నాయని, కొత్త వాటిని తీసుకోవడం ద్వారా 32 శాతం అద్దె బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అద్దె బస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళ్తుందనేది అవాస్తమని తెలిపారు. ప్రస్తుతం సొంత బస్సులు కొనే స్తోమత ఆర్టీసీకి లేదని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి.
LoudSpeakers: లౌడ్‌స్పీకర్లు తొలిగించాల్సిందే.. తమ ఉద్యమం ఆగదంటున్న ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే..
Ashika Ranganath: కుర్రాళ్ళ గుండెల్లో కొంటె బాణాలు గుచ్చుతున్న ఆషిక రంగనాథ్