భాషా భాయ్‌ని ఏపీకి తరలించిన తమిళనాడు పోలీసులు

| Edited By:

Nov 07, 2020 | 11:47 AM

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ భాషా భాయ్‌ని తమిళనాడు పోలీసులు ఏపీకి తరలించారు. కడప జిల్లాలో స్మగ్లర్ల సజీవ దహనం కేసును దర్యాప్తు చేసిన పోలీసులు

భాషా భాయ్‌ని ఏపీకి తరలించిన తమిళనాడు పోలీసులు
Follow us on

Basha Bhai red sandal smuggler: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ భాషా భాయ్‌ని తమిళనాడు పోలీసులు ఏపీకి తరలించారు. కడప జిల్లాలో స్మగ్లర్ల సజీవ దహనం కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇందులో భాషా భాయ్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు తెలుసుకున్నారు. భాషా భాయ్ గ్యాంగ్‌ స్మగ్లర్లు వెళుతున్న కారును ఛేజ్ చేసిన సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక భాషా భాయ్ తమిళనాడులో ఉన్నట్లు తెలుసుకున్న కడప పోలీసులు.. రెండు రోజుల పాటు కోయంబత్తూర్‌లో నిఘా పెట్టి అతడిని పట్టుకున్నారు, కోయంబత్తూరులో విచారణ ముగిసిన తరువాత భాషా భాయ్‌ని ఏపీ పోలీసులకు అప్పగించారు తమిళనాడు పోలీసులు. దీంతో అతడిని కడపకు తీసుకెళ్లారు ఏపీ పోలీసులు.

Read More:

కరోనా కొత్త కేసులు.. 35 ఏళ్లలోపే వారే ఎక్కువట

బన్నీ ‘పుష్ప’.. బాలీవుడ్‌ నటుడితో సుకుమార్ చర్చలు..!