ప్రశాంతంగా తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.. తుది విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ తుది విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఈనెల 21న ఎన్నికలు జరగాల్సిన గ్రామ పంచాయతీల్లో..

ప్రశాంతంగా తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.. తుది విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2021 | 7:16 AM

ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ తుది విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఈనెల 21న ఎన్నికలు జరగాల్సిన గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 13 జిల్లాల పరిధిలో 162 మండలాల్లోని 3,299 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ పదవులతో 34,112 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. బుధవారం ఉదయం 10.30 నుంచి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇక, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 3,323 పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సర్పంచి పదవులకు 17,664 మంది బరిలో ఉన్నారు. 31,516 వార్డు సభ్యుల పదవులకు 77,447 మంది పోటీలో నిలిచారు.

ఇదిలావుంటే, రెండో విడతగా ఈనెల 13న ఎన్నికలు జరిగాల్సిన 3,328 గ్రామ పంచాయతీల పరిధిలో 539 సర్పంచి పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలోని 33,570 వార్డు పదవుల్లో 12,605 వార్డు పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు అధికారులు తెలిపారు.

తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపిరిపీల్చుకుంది. రెండో విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేస్తోంది. మరోవైపు రెండు విడత ఎన్నికలకు రాష్ట్ర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.

ఇదీ చదవండి…