అమరావతి విషయంలో మంత్రి ఆదిమూలపు కీలకవ్యాఖ్యలు

ఒక్క అమరావతినే రాజధానిగా ఉంచి.. సంపదంతా అక్కడే సృష్టించాలనుకోవడం దుర్మార్గపు ఆలోచన అన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్ సురేశ్. లక్ష కోట్ల రూపాయలను ఒకే ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టడంలో..

అమరావతి విషయంలో మంత్రి ఆదిమూలపు కీలకవ్యాఖ్యలు

Updated on: Sep 08, 2020 | 8:04 PM

ఒక్క అమరావతినే రాజధానిగా ఉంచి.. సంపదంతా అక్కడే సృష్టించాలనుకోవడం దుర్మార్గపు ఆలోచన అన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్ సురేశ్. లక్ష కోట్ల రూపాయలను ఒకే ప్రాంతంలో పెట్టుబడిగా పెట్టడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్ అభిమతమని… దానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని ఆయన వివరించారు. పాత పథకాల పేర్లనే మారుస్తూ ప్రచారం చేసుకుంటున్నారంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారని… ‘వైయస్సార్ సంపూర్ణ పోషణ’ గత మెనూకి, ఇప్పటి మెనూకి మధ్య ఉన్న తేడాను చంద్రబాబు గమనించాలని సూచించారు. ఉచిత విద్యుత్తుకు వైయస్ రాజశేఖరరెడ్డి ఆద్యుడైతే, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన వ్యక్తి చంద్రబాబు అని ఆదిమూలపు చెప్పుకొచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us