‘పండుగలా సాగుతుంటే.. తెలుగు తమ్ముళ్ల కడుపు రగిలిపోతోంది’

|

Oct 10, 2020 | 12:03 PM

ఏపీలో జగనన్న విద్యా కానుక పథకం పండుగ వాతావరణంలో సాగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు మూడో రోజూ పంపిణీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దీనిపై సీఎం జగన్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్ల కడుపు రగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఏదో ఒకరకంగా బురద జల్లాలని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ఇది కేంద్ర పథకం అని విమర్శిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా […]

పండుగలా సాగుతుంటే.. తెలుగు తమ్ముళ్ల కడుపు రగిలిపోతోంది
Follow us on

ఏపీలో జగనన్న విద్యా కానుక పథకం పండుగ వాతావరణంలో సాగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు మూడో రోజూ పంపిణీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దీనిపై సీఎం జగన్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడుతున్నారని చెప్పుకొచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్ల కడుపు రగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఏదో ఒకరకంగా బురద జల్లాలని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ఇది కేంద్ర పథకం అని విమర్శిస్తున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడా కూడా షూస్, స్కూల్ బ్యాగ్స్, వర్క్ బుక్స్ ఎక్కడాన్న ఇచ్చారా? అవసరమైతే ప్రతిపక్షాలు పరిశీలించవచ్చని ఆదిమూలపు సవాల్ చేశారు. స్కూల్ బ్యాగ్స్ కు 69 కోట్లు, నోటు బుక్స్ కు 74 కోట్లు, షూస్ మరియు సాక్సులకు 67 కోట్లు, బెల్ట్ కు 10 కోట్లు నిధులు ఖర్చయ్యాయని.. వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చిందని మంత్రి చెప్పారు. చంద్రబాబు లాగా సీఎం జగన్ స్టిక్కర్ సీఎం కాదన్నారు.