
AP inter board exam: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మిగిలిపోయిన ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 3వ తేదీన సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 23న జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
కాగా.. పరీక్షల సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు నిబంధన విధించింది. విద్యార్థులకు గతంలో జారీ చేసినహాల్ టికెట్లను తీసుకుని పరీక్షకు హాజరుకావాలి. కావాలంటే హాల్ టికెట్లను మళ్లీ bie.ap.gov.in లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read: కరోనా అదుపులోకి వచ్చాకే స్కూళ్ళు..: కేంద్ర మంత్రి