జర్నలిస్టులకు ఏపీ సర్కార్ శుభవార్త

|

Aug 01, 2020 | 5:18 AM

విధి నిర్వహణలో నిమగ్నమైన వారిని సైతం కరోనా వైరస్ వదలడం లేదు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆస్పత్రులు గుర్తించనున్నట్లు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

జర్నలిస్టులకు ఏపీ సర్కార్ శుభవార్త
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా, సామన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా కరోనా బారినపడుతున్నారు. విధి నిర్వహణలో నిమగ్నమైన వారిని సైతం కరోనా వైరస్ వదలడం లేదు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆస్పత్రులు గుర్తించనున్నట్లు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను నియమించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో విధి నిర్వహణలో జర్నలిస్టులు కొవిడ్‌ బారి న పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇదిలావుంటే, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ శక్రువారం జర్నలిస్టు సంఘాలతో విజయవాడలో చర్చించారు. ప్రజల్లో ఉండే జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జర్నలిస్టు సంఘాలు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సంబంధించిన ప్రభుత్వం.. జర్నలిస్టుల కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.