ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

|

Nov 12, 2020 | 8:19 PM

ప్రైవేట్ ల్యాబరేటరీల్లో కొవిడ్-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరించింది. ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్​లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీల్లో...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్...కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
Follow us on

covid-19 tests : కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబరేటరీల్లో కొవిడ్-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరించింది. ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్​లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను తగ్గించింది.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు ఇచ్చారు. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు మార్కెట్​లో పూర్తిగా అందుబాటులోకి రావటంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను తగ్గిస్తూ ఆదేశాలు ఇస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

ప్రభుత్వం పంపించే నమూనాలకు 800 రూపాయలు… వ్యక్తిగత పరీక్షలకు 1000 రూపాయలను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రైవేట్ ల్యాబరేటరీలు ఈ ధరల్ని స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.