గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వాలంటీర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Oct 01, 2020 | 4:57 PM

Grama Volunteers Tenure: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వాలంటీర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీతో గడువు ముగిసిన వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. కాగా, జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ గతేడాది ఆగష్టు 15న ప్రారంభమైంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పధకం నేరుగా లబ్దిదారులకు ఇంటి వద్దకే చేరేలా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మొదటి స్పెల్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లను ఏడాది కాలానికి ప్రభుత్వం నియమించుకుంది. వారి పదవీకాలం ఆగష్టు 14తో ముగిసింది. దీనితో తాజాగా మరో ఏడాది పొడిగించింది. ఇక పొడిగింపు సమయంలో వాలంటీర్ల పనితీరును, వ్యక్తిగత ప్రవర్తననూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:

ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..