ఢిల్లీలో ఏపీ ఫైట్.. హస్తినకు చేరిన మండలి రద్దు పంచాయితీ!

| Edited By: Pardhasaradhi Peri

Jan 30, 2020 | 8:29 PM

ఏపీ క్యాపిటల్ ఫైట్ హస్తినకు మారింది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజధానికోసం ఏకంగా మండలిని రద్దు చేయాలని చూస్తున్నారని టీడిపి ఆరోపించింది. మండలి రద్దుకు బ్రేక్ వేసే పనిలో టీడీపీ ఉంది. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే రద్దు ప్రక్రియ ఆగేది లేదని వైసిపి ఎంపీలు తెలిపారు. రాజధాని విభజనపైనా […]

ఢిల్లీలో ఏపీ ఫైట్.. హస్తినకు చేరిన మండలి రద్దు పంచాయితీ!
Follow us on

ఏపీ క్యాపిటల్ ఫైట్ హస్తినకు మారింది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజధానికోసం ఏకంగా మండలిని రద్దు చేయాలని చూస్తున్నారని టీడిపి ఆరోపించింది. మండలి రద్దుకు బ్రేక్ వేసే పనిలో టీడీపీ ఉంది. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే రద్దు ప్రక్రియ ఆగేది లేదని వైసిపి ఎంపీలు తెలిపారు. రాజధాని విభజనపైనా చర్చించాలని టీడీపీ పట్టుబడుతోంది. మండలి రద్దు అంత సులువుకాదు టీడీపీ ఎంపీ కనకమేడల తెలిపారు. వైసిపి ఎంపీల వైఖరిని రాజ్ నాథ్ ఖండించారని అయన అన్నారు. వ్యూహ ప్రతివ్యహాలతో ఇరు పార్టీల ఎంపీలు హల్ చల్ చేస్తున్నారు.