Andhra Pradesh: ఏపీలోని ఈ మండలాల ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక.. బీ అలెర్ట్

|

Apr 28, 2022 | 9:12 PM

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం(ఏప్రిల్ 29) రోజున రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని తెలిపింది.

Andhra Pradesh: ఏపీలోని ఈ మండలాల ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక.. బీ అలెర్ట్
Alert For Ap Residents
Follow us on

AP Heatwave Alert: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం(ఏప్రిల్ 29) రోజున 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ ఏయే మండలాల్లో వడగాల్పులు ఉంటాయో లిస్ట్ రిలీజ్ చేశారు…

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు :-

  1. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు
  2. అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు
  3. కాకినాడ జిల్లాలో కోటనండూరు
  4. పల్నాడు జిల్లాలో అమరావతి మండలం
  5. పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు
  6. విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం

జిల్లాల వారీగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల సంఖ్య :-

ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 12 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు, పల్నాడులో 11 మండలాలు, వైఎస్ఆర్ జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 8 మండలాలు…  మిగిలిన చోట్ల కలిపి మొత్తం 102 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని.. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.

Also Read: Viral: రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత