రేపు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్

|

Sep 21, 2020 | 9:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోులపాటు హస్తినలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రేపు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రెండు రోులపాటు హస్తినలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం 3 గంటలకు జగన్ ఢిల్లీకి పయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్‌ను జగన్ కలిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న జీఎస్టీ నిధులు, కొవిడ్‌ తదితర అంశాలపై సీఎం కేంద్ర మంత్రులకు వివరించే అవకాశముంది. పోలవరం, నరేగా పెండింగ్‌ నిధుల విడుదలపై సీఎం జగన్‌ కేంద్రంతో చర్చించనున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలు తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రధానంగా మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అఫిడవిట్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాటిపైనా చర్చించే అవకాశమందని తెలుస్తోంది. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం దిల్లీ చేరుకుని రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది.