ఏపీలో కొత్తగా ఉద్యోగాల వెల్లువ!

ఏపీ ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళ్తున్న వైఎస్ జగన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించారు. గ్రామ వాలంటీర్లు కాకుండా మరో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పదేసి చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేస్తామని ఏసీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్ల సదస్సులో మరోసారి స్పష్టం చేశారు. దీంతో మొత్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు కలిపి దాదాపు లక్షన్నర మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశముందన్నారు. ఆగస్టు […]

ఏపీలో కొత్తగా ఉద్యోగాల వెల్లువ!
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 3:26 PM

ఏపీ ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళ్తున్న వైఎస్ జగన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించారు. గ్రామ వాలంటీర్లు కాకుండా మరో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పదేసి చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేస్తామని ఏసీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్ల సదస్సులో మరోసారి స్పష్టం చేశారు. దీంతో మొత్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు కలిపి దాదాపు లక్షన్నర మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశముందన్నారు.

ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్లను నియమిస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారన్న జగన్.. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకే వీరిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రలో అవినీతికి తావులేకుండా చేస్తామని స్పష్టంచేశారు. . గ్రామ వాలంటీర్లు, సచివాలయంతో కలిసి ప్రభుత్వ పథకాలను నేరుగా గ్రామలకు చేరుస్తారని జగన్ స్పష్టం చేశారు.