వైసీపీ, టీడీపీలపై సోము వీర్రాజు ఆగ్రహం

|

Sep 08, 2020 | 4:17 PM

ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వంపై దాడులను బీజేపీ సహించదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలో హిందుత్వం మీద దాడులు ఎక్కువయ్యాయన్న ఆయన.. ఇలాంటి ఘటనలను జగన్ సర్కారు సీరియస్ గా తీసుకోవడంలేదని..

వైసీపీ, టీడీపీలపై సోము వీర్రాజు ఆగ్రహం
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వంపై దాడులను బీజేపీ సహించదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలో హిందుత్వం మీద దాడులు ఎక్కువయ్యాయన్న ఆయన.. ఇలాంటి ఘటనలను జగన్ సర్కారు సీరియస్ గా తీసుకోవడంలేదని విమర్శించారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. విశాఖపట్నంలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోము.. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయని మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. నాడు కృష్ణా పుష్కరాల సందర్భంగా 17 దేవాలయాలను టీడీపీ ప్రభుత్వం నేలమట్టం చేసిందని.. అప్పుడు హిందుత్వం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. విజయవాడ గోశాల ఘటనపై మీడియా సమావేశం నిర్వహిస్తుంటే తమపై బుద్ధా వెంకన్న దాడికి యత్నించాడని గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాల్లో ఆలయాలు కూల్చేసినప్పుడు చినరాజప్ప ఏమైపోయారు? అప్పుడు మాట్లాడని చినరాజప్ప అంతర్వేది ఘటనపై ఏవిధంగా మాట్లాడతారంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.