రాముడి గుడి భూమి పూజకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా..!

రాముడి గుడి భూమి పూజకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా..!

రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై...

Sanjay Kasula

|

Aug 03, 2020 | 6:18 PM

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సరయూ నది ఒడ్డున ఉన్న సాకేతపురి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వెలుగు జిలులుగులతో ప్రకాశిస్తున్నశ్రీరామనగరిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నగరం మొత్తం స్వాగత తోరణాలు కడుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి విచ్చేస్తున్న అతిరథ మహారథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. ఇక్బాల్ అన్సారీకి ముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ.. బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదంపై న్యాయ పోరాటం చేశారు. ఆయన 95 ఏళ్ల వయసులో 2016లో కన్నుమూయడంతో ఆ తర్వాత అన్సారీ ఆ బాధ్యత స్వీకరించారు.

తనకు అందిన ఆహ్వానంపై అన్సారీ ఇలా స్పంధించారు… నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని అన్నారు. ‘‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను’ అని అన్సారీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానన్నారు. కోర్టు తీర్పుతో వివాదం ముగిసిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని, ఆయనను కలిసి రామచరిత్‌ మానస్, రామనామం రాసి ఉన్న రాయిని అందజేస్తానని అన్సారీ వెల్లడించారు. నేను అయోధ్యకు చెందినవాడిని, ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం దశ మారుతుందని, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం’ అని అభిప్రాయపడ్డారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu