ఏపీ విద్యార్ధులకు మరో గుడ్ న్యూస్…

కరోనా కాలంలో ఏపీ విద్యార్ధులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. ‘జగనన్న వసతి దీవెన’, ‘జగనన్న విద్యా దీవెన’ పధకాలకు అర్హులైనా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లబ్ది పొందలేని విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అలాంటివారు వెంటనే గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసి వివరాలు అందించాలని ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించి.. అనంతరం ఈ పధకాలకు ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ‘జగనన్న వసతి […]

ఏపీ విద్యార్ధులకు మరో గుడ్ న్యూస్...

Edited By:

Updated on: Jun 24, 2020 | 3:28 PM

కరోనా కాలంలో ఏపీ విద్యార్ధులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. ‘జగనన్న వసతి దీవెన’, ‘జగనన్న విద్యా దీవెన’ పధకాలకు అర్హులైనా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లబ్ది పొందలేని విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అలాంటివారు వెంటనే గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసి వివరాలు అందించాలని ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించి.. అనంతరం ఈ పధకాలకు ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కాగా, ‘జగనన్న వసతి దీవెన’ కింద విద్యార్ధులకు ప్రతీ ఏటా రూ.20వేలను ప్రభుత్వం అందిస్తోంది. వసతి, భోజనం ఖర్చుల నిమిత్తం డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా ఈ డబ్బును వారి తల్లుల అకౌంట్లలోకి నేరుగా జమ చేస్తున్నారు. అటు ‘జగనన్న విద్యా దీవెన’ పధకం ద్వారా స్టూడెంట్స్ కాలేజీ ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us